భర్త రాజా రఘువంశీని ప్రియుడు రాజ్ కుష్వాహా సహకారంతో సోనమ్ చంపేసిందని పోలీసులు వెల్లడించారు. మే 11న రాజా రఘువంశీ-సోనమ్‌కి వివాహం జరిగింది. మే 20న మేఘాలయ హనీమూన్‌కు వెళ్లి మే 23న అదృశ్యమయ్యారు. జూన్ 2న రాజా రఘువంశీ మృతదేహం లభ్యం అయింది.
రాజా రఘువంశీ-సోనమ్‌కు మే 11న మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో వివాహం జరిగిందని.. ఆ సమయంలో అంతా సాధారణంగానే ఉందని రాజా సోదరుడు సచిన్ తెలిపారు. పెళ్లికి ముందు కూడా సోనమ్ కుటుంబంతో కలిసే షాపింగ్ చేసినట్లు వెల్లడించారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన జంట రాజా రఘువంశీ-సోనమ్ హనీమూన్ కోసం మేఘాలయ వెళ్లి అదృశ్యమైంది. కొన్ని రోజుల తర్వాత రాజా శవమై కనిపించగా.. తాజాగా అతడి భార్య పోలీసులకు చిక్కింది. భార్యనే కిరాయి ముఠాతో భర్తను చంపించినట్లుగా పోలీసులు వెల్లడించారు. అంతేకాకుండా మేఘాలయ ముఖ్యమంత్రి, డీజీపీ కూడా స్పష్టం చేశారు.
భర్త రాజా రఘువంశీని సోనమ్ చంపినట్లు వస్తున్న వార్తలను ఆమె తండ్రి తీవ్రంగా ఖండించారు. మేఘాలయ పోలీసులు కట్టు కథలు సృష్టిస్తోందని.. ఈ విషయంలో సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. తన కుమార్తె సోనమ్‌కు ఏ పాపం తెలియదని తండ్రి దేవి సింగ్ మీడియాతో వాపోయాడు.