రాజకీయ నాయకురాలు ఇందిరా శోభన్ శనివారం ఆమ్ ఆద్మీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆమ్ ఆద్మీ పార్టీ ఒక సామాన్యుల పార్టీ అని.. అందుకే తాను ఆ పార్టీలో చేరానన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయాలు పూర్తిగా మారిపోయాయన్నారు. ఒక సాధారణ కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చానని… బీజేపీ, టీఆర్ఎస్ ఒకే గొడుగు కింద పని చేస్తున్నాయని తెలిపారు. కేంద్రంలో బడా మోదీ, రాష్ట్రంలో…
వైఎస్ షర్మిలకు ఊహించని షాక్ తగిలింది. వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి… ఆ పార్టీ సీనియర్ నాయకులు ఇందిరా శోభన్ రాజీనామా చేశారు. ఈ మేరకు తాజాగా కీలక ప్రకటన చేశారు. అంతేకాదు.. రాజీనామా పత్రాన్ని కూడా ఇందిరా శోభన్ విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల అభిష్టం మేరకు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి తాను రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు ఇందిరా శోభన్. ” షర్మిల వైఎస్‌ఆర్‌టీపీ పార్టీకి రాజీనామా చేస్తున్నాను. నన్ను ఆదిరిస్తున్న తెలంగాణ ప్రజలకు ఎప్పుడూ రుణపడి…