బీజేపీ మతోన్మాద, కార్పొరేట్ విధానాలకు వ్యతిరేకంగా సంక్షేమం, మత సామరస్యం, ప్రజాస్వామ్యం, సామాజిక న్యాయం కోసం అంటూ సీపీఎం అఖిల భారత కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణలో నేటి నుంచి జన చైతన్య యాత్ర ప్రారంభం కానుంది.
బీజేపీ, టీఆర్ఎస్ మధ్య వరిపై మొదలైన మాటల యుద్ధం సవాళ్లు విసురుకునే దాకా వెళుతోంది. యాసంగి ధాన్యం సంగతేంటని ప్రశ్నించిన టీఆర్ఎస్.. రాష్ట్రవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నాలకు పిలుపు ఇచ్చింది. నేడు ఇందిరా పార్క్ దగ్గర పెద్ద ఎత్తున ధర్నాకు ప్లాన్ చేశారు. రాష్ట్రం పట్ల మోడీ ప్రభుత్వం వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ విమర్శిస్తోంది. పంజాబ్ రాష్ట్రం తరహాలోనే తెలంగాణలోనూ వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని టీఆర్ఎస్ డిమాండ్ చేస్తోంది. కేంద్రం నుంచి స్పష్టత వచ్చే…
ధాన్యం సేకరించాలంటూ కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు ప్రత్యక్ష కార్యాచరణకు దిగుతోంది తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ.. కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ను టార్గెట్ చేస్తూ రేపు రాష్ట్రవ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ధర్నాలు చేపట్టనుంది.. అందులో భాగంగా.. హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ దగ్గరకు కూడా ధర్నా తలపెట్టారు.. దీని కోసం అనుమతి కోరుతూ పోలీసులకు పర్మిషన్ అప్లై చేవారు ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్.. దానిని పరిశీలించిన సెంట్రల్ జోన్ పోలీసులు.. కొన్ని షరతులత కూడిన అనుమతి మంజూరు…
ఇందిరాపార్క్ లో ఉదయం, సాయత్రం సమయాల్లో పెద్ద సంఖ్యలో నగరవాసులు వాకింగ్ చేసేందుకు వస్తుంటారు. అయితే, ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు సామాన్యప్రజలకు ప్రవేశం ఉంటుంది. ఇందిరా పార్క్‌కు ఎక్కువగా ప్రేమ జంటలు వస్తుంటాయి. అయితే, గత కొంతకాలంగా ఈ పార్క్ అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతుండటంతో పార్క్ యాజమాన్యం గేటు ముందు ఓ ఫ్లెక్సీని ఏర్పాటు చేసింది. పెళ్లికాని జంటలకు ప్రవేశం లేదని ఆ ఫ్లెక్సీలో పేర్కొన్నారు. దీంతో నెటిజన్లు ఈ ఫ్లెక్సీపై…