పసిడికి డిమాండ్ తగ్గిపోతోంది.. జనవరి–మార్చి త్రైమాసికంలో డిమాండ్ భారీగా అంటే ఏకంగా 17 శాతం పడిపోయింది. వినియోగదారులు తీవ్ర ధరల కారణంగా కొనుగోళ్లను వాయిదా వేసుకునే పరిస్థితి రావడంతో ఇలా జరిగిందని.. మొదటి త్రైమాసికంలో పసిడి డిమాండ్ ట్రెండ్స్ పేరుతో ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) విడుదల చేసిన తన నివేదికలో పేర్కొంది