జులై మధ్యలో కెన్యాలో అదృశ్యమైన ఇద్దరు భారతీయ టెకీలను పోలీసు ప్రత్యేక విభాగం చంపినట్లు అధ్యక్షుడు విలియం రూటో సహాయకుడు తెలిపారు. బాలాజీ టెలిఫిల్మ్స్ మాజీ సీవోవో జుల్ఫికర్ ఖాన్, మరొక భారతీయుడు మొహమ్మద్ జైద్ సమీ కిద్వాయ్ రెండు నెలల క్రితం నైరోబీలో ఓ క్లబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారు.