Indians Missing: కెన్యాలో అదృశ్యమైన ఇద్దరు భారతీయులు మృతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indians Missing: జులై మధ్యలో కెన్యాలో అదృశ్యమైన ఇద్దరు భారతీయ టెకీలను పోలీసు ప్రత్యేక విభాగం చంపినట్లు అధ్యక్షుడు విలియం రూటో సహాయకుడు తెలిపారు. బాలాజీ టెలిఫిల్మ్స్ మాజీ సీవోవో జుల్ఫికర్ ఖాన్, మరొక భారతీయుడు మొహమ్మద్ జైద్ సమీ కిద్వాయ్ రెండు నెలల క్రితం నైరోబీలో ఓ క్లబ్ నుంచి బయటకు వచ్చిన తర్వాత కనిపించకుండా పోయారు. కెన్యా అధ్యక్ష ఎన్నికల్లో విలియం రూటో తరఫున ఎన్నికల ప్రచార బృందంలో వీరు చేరినట్లుగా సమాచారం. వీరి మృతి వార్తను కెన్యా అధ్యక్షుడు విలియం రూటో సహాయకుడు డెనిస్ ఇటుంబి విడుదల చేసిన ఒక ప్రకటనలో తెలిపారు. కెన్యా ‘కిల్లర్ పోలీసులే’ వారిని హత్య చేశారని పేర్కొన్నారు.
Sri lanka: దక్షిణాసియాలో ప్రారంభం కానున్న తొలి డిస్నీల్యాండ్
Also Read
- Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
- West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
- ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
- Bhutan PM: మోడీ ‘విష్ణువు అవతారం’.. 25 ఏళ్ల పాలనపై భూటాన్ ప్రధాని ప్రశంసలు
ఈ వార్త ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వార్తను కెన్యా అధ్యక్షుడి సహాయకుడు ధ్రువీకరించాడు. వీరిద్దరూ నైరోబీలోని క్లబ్ నుంచి గత జూలై నెలలో అదృశ్యమైనట్లుగా తెలుస్తోంది. కాగా, కెన్యా కిల్లర్ పోలీసులే వారిని హత్య చేశారని ప్రభుత్వ ప్రతినిధి వెల్లడించారు. అంతకుముందు, తప్పిపోయిన వ్యక్తులను తిరిగి కనుగొనే ప్రయత్నంలో అపహరణ జరిగిన ప్రదేశం నుంచి సీసీటీవి ఫుటేజీని తిరిగి పొందినట్లు పోలీసు అధికారులు తెలిపారు. విచారణలో సహాయపడేందుకు స్థానిక డిటెక్టివ్‌ల విభాగాన్ని కూడా ఆశ్రయించారు. ఇప్పటివరకు లభించిన ఆధారాల మేరకు వారిద్దరు కారులో వెళ్తుండగా.. డ్రైవర్‌తో పాటు వీరిని కూడా కిడ్నాప్ చేశారని, కిడ్నాప్ చేసిన మూడు రోజుల తర్వాత వారిని చంపినట్లు అధ్యక్షుడి సహాయకుడు ఇటుంబి తన ప్రకటనలో పేర్కొన్నారు. కిడ్నాప్ అనంతరం వారిని నైరోబీకి 150 కిలోమీటర్ల దూరంలోని అబేర్‌డేర్స్‌కు పంపారని తెలిపారు. వీరి అదృశ్యంపై భారత విదేశాంగశాఖ అధికార ప్రతినిధి ఆరిందమ్ బాగ్చితోపాటు బాలాజీ టెలిఫిల్మ్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ ఏక్తా కపూర్ కూడా కెన్యా ప్రభుత్వానికి లేఖ రాశారు. వీరి ఆచూకీ కనుగొని భారత్‌కు పంపాలని వారు విజ్ఞప్తి చేశారు.
తాజావార్తలు
-
Instagram Love: ఇన్స్టాగ్రామ్ లవ్.. హిందు వివాహం.. భర్త ముస్లిం అని తెలిసి షాక్!
-
West Bengal: మారనున్న పశ్చిమ బెంగాల్ పేరు.. కొత్త పేరు ఇదే!
-
ICC Rankings: ఒక్క సెంచరీతో టాప్‌లోకి దూసుకెళ్లిన శ్రేయస్ అయ్యర్.. తగ్గిన విరాట్ కోహ్లీ ర్యాంక్..
-
Mythri Ravi: “రూ. 2 కోట్లతో తీస్తే రూ. 400 కోట్లా? మాకు ఇది చెంపపెట్టు”
-
Pre-Launch Scam: తెల్లాపూర్‌లో తక్కువ ధరకే ఫ్లాట్లు అని ఎర.. నిలువునా ముంచిన బిల్డర్
ట్రెండింగ్
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!