రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌తో బుధవారం ఆస్తానాలో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రాంతంలో చిక్కుకున్న తమ పౌరులపై భారత్ ఆందోళనలను లేవనెత్తారు. వారు సురక్షితంగా తిరిగి రావాలని ఒత్తిడి చేశారు . యుద్ధం నేపథ్యంలో భారతీయుల సమస్యపై లావ్‌రోవ్‌తో లేవనెత్తారా అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి జైశంకర్ స్పందించారు.