అమెరికాలో నివసిస్తున్న భారతీయులకు భారత ప్రభుత్వం శుభవార్త అందించింది. భారత రాయబార కార్యాలయం ఆధ్వర్యంలో లాస్ ఏంజిల్స్‌లో కొత్త ఇండియన్ కాన్సులర్ అప్లికేషన్ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కాన్సులర్ సెంటర్ డిసెంబర్ 15, 2025 నుంచి కార్యకలాపాలు ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా పాస్‌పోర్ట్ సేవలు, వీసా సంబంధిత ప్రక్రియలు, ఓవర్‌సీస్ సిటిజన్ ఆఫ్ ఇండియా కార్డు దరఖాస్తులు, జనన–మరణ ధృవీకరణ పత్రాలు, అటెస్టేషన్ తదితర కాన్సులర్ సేవలను మరింత సులభంగా, వేగంగా పొందే అవకాశం కలుగుతుంది.…