కెనడాలో కాల్పులు కలకలం సృష్టించాయి. ఈ కాల్పుల్లో భారతీయ విద్యార్థిని ప్రాణాలు కోల్పోయింది. బస్టాప్ లో బస్సుకోసం ఎదురుచూస్తుండగా.. ఇద్దరు కారు డ్రైవర్లు ఒకరిపై ఒకరు కాల్పులు జరిపిన సమయంలో ఆ విద్యార్థినికి తూటా తగలడంతో మృతిచెందిందని పోలీసులు తెలిపారు. మరణించిన విద్యార్థిని హర్‌సిమ్రత్ రంధావా గుర్తించారు. ఆమె కెనడాలోని ఒంటారియోలోని మేహాక్ కళాశాలలో చదువుతోంది. హామిల్టన్ పోలీసులు ఈ హత్యపై దర్యాప్తు చేస్తున్నారు. Also Read:AP Liquor Scam: ఏపీ లిక్కర్ స్కాంలో సిట్ దూకుడు..…
రష్యా-ఉక్రెయిన్ యుద్ధ ప్రభావం ఇతర దేశాలపై పడుతోంది. ముఖ్యంగా విద్యార్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖార్కివ్ నగరంలో జరిగిన రష్యా రాకెట్ దాడిలో భారతీయ విద్యార్ధి మరణించినట్టు తెలుస్తోంది. కర్నాటకకు చెందిన విద్యార్ధిగా భారత విదేశాంగ శాఖ తెలిపింది. మృతి చెందిన విద్యార్థి కుటుంబంతో మాట్లాడుతున్నామని చెప్పింది విదేశీ వ్యవహరాల శాఖ. విద్యార్ఘి కుటుంబానికి ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తం చేసింది విదేశీ వ్యవహరాల శాఖ. విదేశీ వ్యవహారాల శాఖకు చెందిన అధికారి దీనిని ట్విట్టర్ ద్వారా ధృవీకరించారు.