ఆపరేషన్ సిందూర్ సమయంలో సహాయం అందించడానికి 400 మందికి పైగా శాస్త్రవేత్తలు 24 గంటలూ పనిచేశారని ఇస్రో (భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ) ఛైర్మన్ వి నారాయణన్ మంగళవారం అన్నారు. సైనిక ఆపరేషన్ సమయంలో భూమి పరిశీలన, ఉపగ్రహాల కమ్యూనికేషన్ వంటి సహాయ సహకారాలు అందించారని తెలిపారు.
ISRO: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ISRO) తన అంతరిక్ష ప్రయోగాలలో మరో చరిత్రను సృష్టించింది. శ్రీహరికోటలోని సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుండి 100వ ప్రయోగాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రయోగంలోజీఎస్ఎల్వీ-ఎఫ్15 (GSLV-F15)రాకెట్ ద్వారా నూతన నావిగేషన్ ఉపగ్రహం ఎన్వీఎస్-02 (NVS-02) ను కక్ష్యలో ప్రవేశపెట్టింది. దేశీయంగా అభివృద్ధి చేసిన ఎన్వీఎస్-02 ఉపగ్రహం భారతీయ ప్రాంతీయ నావిగేషన్ వ్యవస్థ (నావిక్) విస్తరణలో కీలక పాత్ర పోషించనుంది. దీని మొత్తం బరువు 2,250 కిలోలు…
తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో మొదటి ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి అగ్నిబాన్ ప్రైవేటు రాకెట్ నింగికెగిరి చరిత్ర సృష్టించింది. ఈ రోజు ఉదయం 7. 15 గంటలకు విజయవంతంగా షార్ లోని ప్రైవేట్ లాంచ్ పాడ్ నుంచి విజయవంతంగా ప్రయోగించారు.