రెండవ త్రైమాసికంలో అద్భుతమైన GDP వృద్ధి రేటు ఉన్నప్పటికీ డిసెంబర్ 1న (సోమవారం) US డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ ఆల్‌టైమ్ కనిష్ఠస్థాయికి పడిపోయింది. US డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 89.76కి పడిపోయింది. ఇది రూపాయి చరిత్రలోనే అతి తక్కువ స్థాయి. ఈ ఘటన దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఆందోళనలు రేకెత్తించింది. ఈ రోజు విదేశీ ఎక్స్చేంజ్ మార్కెట్‌లో రూపాయి మొదట్లో 89.45 వద్ద ప్రారంభమైనప్పటికీ, మధ్యాహ్నం నాటికి దాని విలువ మరింత…