హమాస్‌తో సంబంధాలు ఉన్నాయంటూ భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరిని అరెస్ట్ చేసి బహిష్కరించింది. అయితే ఈ బహిష్కరణను వర్జీనియా కోర్టు అడ్డుకుంది. తదుపరి ఉత్వర్వులు ఇచ్చేంత వరక బహిష్కరణపై నిర్ణయాలు తీసుకోవద్దని ఆదేశించింది.
అక్రమ వలసదారులపై అగ్రరాజ్యం అమెరికా ఉక్కుపాదం మోపింది. ఇప్పటికే అక్రమంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న భారతీయులను వెనక్కి పంపేసింది. తాజాగా భారతీయ పరిశోధకుడు బాదర్ ఖాన్ సూరి అమెరికాలో బహిష్కరణకు గురయ్యాడు. హమాస్‌కు మద్దతుగా.. యూదు మతానికి వ్యతిరేకంగ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడంతో బాదర్ ఖాన్ సూరిపై బహిష్కరణ వేటు వేసింది.