Mohan Bhagwat: భాషా వివాదాల నేపథ్యంలో రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్) చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో భాష, కులం, సంపద వంటి భేదాలను పక్కనపెట్టి సామాజక సామరస్యతను కాపాడుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతీ వ్యక్తి తన ఇంట్లో తప్పనిసరిగా మాతృభాష మాట్లాడాలని, అలాగే ఇతర రాష్ట్రాల్లో నివసిస్తున్న వారు ఆ ప్రాంతాల భాషను నేర్చుకోవాలని అన్నారు. భారత్ లోని అన్ని భాషలకు సమాన గౌరవం ఉందని ఆయన అన్నారు.
ప్రముఖ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దేశభక్తిపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి. జులై 25న జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కానున్న ఆయన తాజా చిత్రం ‘సర్‌జమీన్’ ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పృథ్వీరాజ్ దేశాన్ని ప్రేమించడం పై తన భావాలను వెల్లడించారు. “నిజమైన దేశభక్తి అంటే, ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా ‘నేను భారతీయుడిని’ అని గర్వంగా చెప్పడమే” అని పృథ్వీరాజ్ తెలిపారు. తనది కేరళ అయినా, మలయాళం మాట్లాడినా, మహారాష్ట్ర వాడు అయినా హిందీ…