India’s SuperGaming Raises: భారతీయ ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ సూపర్‌గేమింగ్ తాజా రౌండ్ నిధులలో US $15 మిలియన్లను సేకరించింది. ఈ మొత్తాన్ని భారత కరెన్సీలోకి మారుస్తే, రూ.132 కోట్లు అవుతుంది. ఈ కంపెనీ మాస్క్‌గన్, ఇండస్ బాటిల్ రాయల్ వంటి భారతీయ షూటింగ్ గేమ్‌లను తయారు చేస్తుంది. రౌండ్ నిధులు అంటే.. సంస్థ లేదా స్టార్టప్ తమ వ్యాపార కార్యకలాపాలను విస్తరించడానికి లేదా కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడానికి పెట్టుబడిదారుల నుంచి నిధులను సేకరించే ప్రక్రియ.