(అక్టోబర్ 10న ‘తాండ్ర పాపారాయుడు’కు 35 ఏళ్ళు) రెబల్ స్టార్ కృష్ణంరాజు తమ గోపీకృష్ణా మూవీస్ పతాకంపై అనేక జనరంజకమైన చిత్రాలను తెరకెక్కించారు. సొంత సంస్థ నిర్మించిన చిత్రాలతోనే కృష్ణంరాజు స్టార్ డమ్ అందుకున్నారంటే అతిశయోక్తి కాదు. “కృష్ణవేణి, భక్తకన్నప్ప, అమరదీపం, బొబ్బిలిబ్రహ్మన్న” వంటి చిత్రాలు నటునిగా కృష్ణంరాజును జనం మదిలో నిలిపాయి. దర్శకరత్న దాసరి నారాయణరావు నిర్దేశకత్వంలో కృష్ణంరాజు సమర్పణలో రూపొందిన చిత్రం ‘తాండ్ర పాపారాయుడు’. ఈ చిత్రానికి కృష్ణంరాజు తమ్ముడు యు.వి. సూర్యనారాయణ రాజు…