తమన్నా బౌన్సర్ గా నటిస్తున్న ‘బబ్లీ బౌన్సర్’ షూటింగ్ పూర్తి కావచ్చింది. పలు జాతీయ అవార్డులను సొంతం చేసుకున్న మధుర్ భండార్కర్ దీనికి దర్శకుడు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగిల్ పిక్చర్స్ కలసి నిర్మిస్తున్న ఈ చిత్రం ఉత్తర భారతంలోని బౌన్సర్ సిటీ అసోలా ఫతేపూర్‌కి చెందిన ఓ మహిళా బౌన్సర్ కథ. తమన్నా టైటిల్ రోల్ పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఫిబ్రవరి 18న ప్రారంభమైంది. దీనికి సంబంధించి ఇంకా 5 రోజుల షూటింగ్ మాత్రమే…
తాను అనుకున్నది కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడడం, వెనకా ముందూ చూసుకోకుండా ముక్కుసూటిగా సాగడం చేసేవారిని జనం అంతగా మెచ్చరు. పైగా వారి ప్రవర్తన చూసి ‘పిచ్చి పుల్లయ్య’ అంటూ బిరుదు కూడా ఇస్తారు. తెలుగు చిత్రసీమలో దర్శకనిర్మాత పి.పుల్లయ్యను అలాగే పిలిచేవారు. ఆ రోజుల్లో తెలుగు సినిమాలో ఇద్దరు పుల్లయ్యలు దర్శకులుగా రాజ్యమేలారు. వారిలో ఒకరు చిత్తజల్లు పుల్లయ్య. మరొకరు పోలుదాసు పుల్లయ్య. ఇద్దరూ మేటిదర్శకులుగా వెలుగొందారు. ప్రఖ్యాత నటి శాంతకుమారి భర్త పి.పుల్లయ్య. ఈ దంపతులు…
అభిరుచి ఉండాలే కానీ, అనుభవంతో పనేంటి!? పట్టుమని తీసింది రెండంటే రెండే సినిమాలు. జనం నాడి ఇట్టే పట్టేశాడు. జనం కోరేదే మనం అందించాలని నిర్ణయించాడు. ‘మహానటి’ని తెరకెక్కించాడు. అంతే… ఆ ఒక్క సినిమాతోనే జనం మదిని భలేగా దోచేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. ఇప్పుడు నాగ్ అశ్విన్ అంటే అంతగా తెలియని వారు సైతం, ‘మహానటి’ డైరెక్టర్ అనగానే అతని పేరు చెప్పేస్తున్నారు. అంతలా పాపులర్ అయిన నాగ్ అశ్విన్ త్వరలోనే ప్రభాస్, దీపికా పదుకొణేతో…
(సెప్టెంబర్ 27న యశ్ రాజ్ చోప్రా జయంతి) భారతీయ సినిమా రంగంలో అరుదైన అన్నదమ్ములు కొందరున్నారు. వారంతా ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నవారు. వారిలో బి.యన్.రెడ్డి – బి.నాగిరెడ్డి, రాజ్ కపూర్ – శశికపూర్, బి.ఆర్.చోప్రా – యశ్ రాజ్ చోప్రా సుప్రసిద్ధులు. అన్న బి.ఆర్.చోప్రా బాటలోనే పయనిస్తూ ఆయన సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన యశ్ రాజ్ చోప్రా తరువాతి రోజుల్లో దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. రొమాంటిక్ మూవీస్ తెరకెక్కించడంలో మేటిగా…
(సెప్టెంబర్ 21న సింగీతం శ్రీనివాసరావు పుట్టినరోజు) ప్రయోగాలు చేయడం గొప్పకాదు. వాటిని సఫలీకృతం చేసుకుంటేనే గొప్ప. చిత్రసీమలో సింగీతం శ్రీనివాసరావు పలు ప్రయోగాలు చేసి గొప్పగా నిలిచారు. వయసులో ఏముంది, మనసులోనే అంతా ఉందంటూ కాలంతో పరుగులు తీస్తున్న పడచువాడు సింగీతం. ఆయన ఆలోచనలన్నీ వర్తమానంలోనే భవిష్యత్ ను చూపిస్తూ ఉంటాయి. సింగీతం ఆలోచనల్లో 30 ఏళ్ళ క్రితం పురుడు పోసుకున్న ‘ఆదిత్య 369’ మన దేశంలో తొలి టైమ్ మిషన్ మూవీగా నిలవడమే కాదు, ఈ…