Microsoft Layoff: ఆర్థికమాంద్యం భయాలు టెక్ దిగ్గజ కంపెనీలను భయపెడుతున్నాయి. ఆదాయాలు తగ్గడంతో ఖర్చులను అదుపు చేసేందుకు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఇప్పటికే ట్విట్టర్, అమెజాన్, మెటా వంటి సంస్థలు ఉద్యోగులకు ఉద్వాసన పలికాయి. తాజాగా ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్ కూడా చేరింది. ఏకంగా 10,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. బుధవారం నుంచే తొలగింపుల ప్రక్రియను చేపట్టింది. ఈ ఏడాది మూడో త్రైమాసికం కల్లా ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ప్రకటించింది.