ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘంతో కేటీఆర్, పలువురు బీఆర్‌ఎస్ నాయకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆహ్వానం మేరకు సమావేశానికి వచ్చాం.. దేశంలో ఎన్నికలు జరుగుతున్న పరిస్థితులు.. తీసుకురావాల్సిన సంస్కరణలు పై స్వేచ్ఛగా వివరించామన్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో దేశాలు బ్యాలెట్ ద్వారా ఎన్నికలు నిర్వహిస్తున్నారు..
Rahul Gandhi Fire On EC: దేశ రాజధాని ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో ఇవాళ జరుగుతున్న కాంగ్రెస్ న్యాయ సదస్సులో రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. నేను రాజును కాదు, రాజా కావాలని కోరుకోను.. రాజు కాన్సెప్ట్ కు నేను వ్యతిరేకం అన్నారు.
ఆధార్ కార్డు, ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈపీఐసీ (EPIC)ని ఆధార్‌తో లింక్ చేయడం కోసం ఆర్టికల్ 326, ప్రజా ప్రాతినిధ్య చట్టం 1950, సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం ఆధార్ కార్డు ఓటర్ కార్డు అనుసంధానానికి ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. త్వరలో యుఐడీఏఐ(UIDAI), కేంద్ర ఎన్నికల సంఘం నిపుణుల మధ్య సాంకేతిక సంప్రదింపులు ప్రారంభం కానున్నాయి.
భారత దేశంలో ఎన్నికల హాడావుడి కొనసాగుతుంది. ఈ ఎన్నికలను బీజేపీ సహా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు సీరియస్‌గా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో భారత్‌లో జరగనున్న లోక్‌సభ ఎన్నికల్లో చైనా జోక్యం చేసుకునే అవకాశాలు ఉందని మైక్రోసాఫ్ట్ ఆందోళన వ్యక్తం చేసింది.