ఆఫ్ఘనిస్తాన్‌లో పరిస్థితులు రోజురోజుకు దిగజారిపోతున్నాయి. ప్రజాస్వామ్యానికి తావులేదని, షరియా చట్టం ప్రకారమే పాలన ఉంటుందని, అయితే, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రానివ్వమని, మహిళలకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని చెబుతూనే, వారిపై దాడులు చేస్తున్నారు. ఆఫ్ఘనిస్తాన్ జాతీయజెండాను ప్రదర్శిస్తున్న పౌరులపై కాల్పులు జరుపుతున్నారు. ముష్కరుల పాలన ఎలా ఉండబోతుందో చెప్పేందుకు ఇది కేవలం ఓ ఉదాహరణ మాత్రమే. ఇక ఆఫ్ఘనిస్తాన్‌లోని రాయబార కార్యాలయాలను ఇప్పటికే ఇండియా ప్రభుతవం మూసేసింది. కాబూల్, హెరాత్, కాందహార్‌లో భారత రాయబార కార్యాలయాలు…