భారత బాక్సర్ ప్రీతీ పవార్ వియత్నాంకు చెందిన వో థి కిమ్ అన్‌ను ఓడించి పారిస్ ఒలింపిక్స్ మహిళల 54 కేజీల విభాగంలో ప్రీక్వార్టర్ ఫైనల్‌లోకి ప్రవేశించింది. ఆసియా క్రీడల కాంస్య పతక విజేత ప్రీతి పవార్ తొలిసారిగా ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంటోంది. శనివారం జరిగిన మ్యాచ్‌లో 5-0తో గెలిచి బాక్సింగ్‌లో భారత్ ప్రచారానికి శుభారంభం ఇచ్చింది.