టోక్యో ఒలింపిక్స్ 2020లో కాంస్య పతకాన్ని గెలుచుకున్న బాక్సర్ లోవ్లినా బోర్గోహైన్, పారిస్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు మించి వెళ్లలేకపోయింది. పారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గెన్ పోరాటం ముగిసింది. ఆదివారం జరిగిన మహిళల 75 కేజీల క్వార్టర్ ఫైనల్లో చైనా క్రీడాకారిణి, వరల్డ్ నెంబర్-1 బాక్సర్ లీ కియాన్ చేతిలో 1-4 తేడాతో ఓటమి పాలయ్యారు.