జి.ఎస్.కె ప్రొడక్షన్స్ పతాకంపై శివ దర్శకత్వంలో శివ ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రం ‘వైట్ పేపర్’. ప్రభాస్ ‘ఈశ్వర్’లో ప్రభాస్ ఫ్రెండ్ గా నటించిన అభినయ కృష్ణ ఆ తర్వాత పలు చిత్రాల్లో కమెడియన్ గా నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు. ఇక ‘జబర్దస్త్’ షో తో అదిరే అభి గా మారాడు. అతడు ఇప్పుడు ‘వైట్ పేపర్’ చిత్రంతో హీరోగా పరిచయం అవుతున్నాడు. అయితే ఈ చిత్రాన్ని 9 గంటల 51 నిమిషాల్లో పూర్తి చేయటం విశేషం.…