పాకిస్థాన్‌లో మరో ఉగ్రవాది హతమయ్యాడు. 1981లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ (ఐఏ) విమానాన్ని హైజాక్ చేసిన వాంటెడ్ టెర్రరిస్ట్ గజిందర్ సింగ్ (74) మరణించాడు. పాకిస్థాన్‌లోని ఓ ఆసుపత్రిలో గుండెపోటుతో ఆయన మరణించినట్లు సమాచారం. గజిందర్ సింగ్ ఒక పేరుమోసిన ఉగ్రవాది, అతను ఖలిస్తాన్ అనుకూల సంస్థ "దాల్ ఖల్సా" సహ వ్యవస్థాపకుడు. 1981లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం ఐసీ-423 హైజాక్‌లో ప్రధాన కుట్రదారుల్లో ఇతను ఒకడు. శ్రీనగర్ నుంచి ఢిల్లీకి వెళుతున్న విమానం హైజాక్‌కు గురై పాకిస్థాన్‌లోని…