Asian Games 2023: టేబుల్ టెన్నిస్‌లో చరిత్ర.. రోలర్ స్కేటింగ్‌లో రెండు పతకాలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sutirtha and Ayhika Mukherjee Wins bronze medal in Table Tennis at Asian Games 2023: చైనాలోని హాంగ్‌జౌ నగరంలో జరుగుతున్న ఆసియా క్రీడలు 2023లో భారత అథ్లెట్లు సత్తాచాటుతున్నారు. రికార్డులు నమోదు చేస్తూ.. చరిత్రను తిరగరాస్తూ పతకాల వేటలో దూసుకెళ్తున్నారు. ఆదివారం ఒక్కరోజే 15 మెడల్స్ గెలిచిన భారత క్రీడాకారులు.. సోమవారం కూడా మెడల్స్ వేట కొనసాగిస్తున్నారు. టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ విభాగంలో భారత్‌కు కాంస్యం దక్కింది. సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ సెమీస్ మ్యాచ్‌లో ఓడిపోయారు.
టేబుల్ టెన్నిస్ వుమెన్స్ డబుల్స్ సెమీ-ఫైనల్ మ్యాచ్‌లో ఉత్తర కొరియాకు చెందిన సుయోంగ్ చా మరియు సుగ్యోంగ్ పాక్‌ల చేతిలో సుతీర్థ ముఖర్జీ, ఐహిక ముఖర్జీ 4-3 తేడాతో ఓడిపోయారు. వీరు ఓడిపోయినా కాంస్య పతకంతో భారత టేబుల్ టెన్నిస్‌లో స్వర్ణ యుగానికి నాంది పలికారు. ఆసియా క్రీడల్లో టేబుల్ టెన్నిస్ డబుల్స్ విభాగంలో భారత్‌కు ఇదే మొదటి పతకం కావడం విశేషం. దాంతో ముఖర్జీ సిస్టర్స్ సరికొత్త చరిత్ర సృష్టించారు. 2018లో జకార్తాలో పురుషుల జట్టు మరియు మిక్స్‌డ్ జట్టు కాంస్య పతకాలను సాధించాయి.
Also Read
- Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
- Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
- Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
- Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
Also Read: Virat Kohli: ఉన్నపలంగా ముంబై వెళ్లిన విరాట్ కోహ్లీ.. అసలు కారణం అదేనా?
భారత స్కేటింగ్ రిలే టీమ్ కూడా కాంస్య పతకం సాధించింది. వుమెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్లలో భారత ప్లేయర్లు కార్తిక జగదీశ్వరన్, హీరాల్ సధూ, ఆరతి కస్తూరి కాంస్య పతకం సొంతం చేసుకున్నారు. సమష్టిగా రాణించిన భారత ప్లేయర్స్ 4:34.861 నిమిషాల్లో లక్ష్యాన్ని చేరుకుని పతకం ఖాయం చేసుకున్నారు. మరోవైపు రోలర్ స్కేటింగ్‌లో అబ్బాయిలు అదరగొట్టారు. మెన్స్ స్పీడ్ స్కేటింగ్ 3000 మీటర్ల రిలే టీమ్ ఈవెంట్లో కాంస్యం కైవసం చేసుకున్నారు.
SMASHING IN STYLE: THE MUKHERJEE SISTERS🏓
🇮🇳’s Table Tennis phenomenal duo, Ahyika Mukherjee and Sutirtha Mukherjee script history at #AsianGames2022 by clinching the BRONZE MEDAL 🏓🥉 in the women’s doubles event! 🙌💫
They’ve broken the barrier in style, getting India’s… pic.twitter.com/FDVUgnD06p
— SAI Media (@Media_SAI) October 2, 2023
తాజావార్తలు
-
IND vs WI 2nd ODI: భారత్, వెస్టిండీస్ రెండో వన్డే.. తెలుగోడు అవుట్.. అరంగేట్రం చేసిన దేశవాళీ కింగ్!
-
Gudivada Amarnath: చంద్రబాబు ఏం చేసినా అమ్మకాలే.. గుడివాడ అమర్నాథ్ సంచలన ఆరోపణలు
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Jani Master: జానీ మాస్టర్‌కు బిగ్ షాక్.. ఫిల్మ్ ఫెడరేషన్ సంచలన నిర్ణయం..
-
Subsidised Onions: సామాన్యులకు గుడ్‌న్యూస్.. సబ్సిడీపై ఉల్లిపాయల విక్రయాలు..
ట్రెండింగ్
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్‌డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!
-
IP68+IP69 రేటింగ్, 8,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో కొత్త బడ్జెట్ ఫోన్ Vivo Y600i లాంచ్..!
-
165Hz OLED డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, యాక్టివ్ కూలింగ్ ఫ్యాన్‌తో iQOO Pad Ultra టాబ్లెట్ లాంచ్.!
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!