పొరుగు దేశం చైనా తన చేష్టలను వదిలిపెట్టడం లేదు. తూర్పు లడఖ్‌లో చైనా తన ఉనికిని పటిష్టం చేసుకునే పనిలో రోజురోజుకూ బిజీగా ఉంది. తూర్పు లడఖ్‌లోని పాంగాంగ్ సరస్సు పరిసర ప్రాంతాల్లో కూడా చైనా సైన్యం చాలా కాలంగా తవ్వకాలు జరుపుతోంది.
Sri Lanka: భారత్‌పై నిఘా పెట్టేందుకు చైనా శ్రీలంకను పావుగా వాడుకుంటోంది. ఇప్పటికే శ్రీలంకకు ఇచ్చిన అప్పులకు బదులుగా ఆ దేశం హంబన్‌టోట నౌకాశ్రయాన్ని డ్రాగన్ కంట్రీకి లీజుకు ఇచ్చింది. తరుచుగా చైనాకు చెందిన పరిశోధన నౌకలు శ్రీలంక, మాల్దీవుల్లో లంగరు వేస్తున్నాయి.
Jay Shah Says Rohit Sharma Lead India in ICC Champions Trophy 2025: టీమిండియా కెప్టెన్సీపై బీసీసీఐ కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చారు. టీ20 ప్రపంచకప్ 2024ను అందించిన రోహిత్ శర్మ నాయకత్వంలోనే భారత్ ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో తలపడనుందని స్పష్టం చేశారు. ప్రపంచ టెస్టు ఛాంపియన్షిప్ (డబ్ల్యూటీసీ) 2023-25 ఫైనల్‌కు భారత్ చేరితే.. రోహితే సారథ్యం వహిస్తాడని తెలిపారు. హిట్‌మ్యాన్ సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ గెలుస్తాయని…
Char Dham Yatra: ఉత్తరాఖండ్ లోని గర్వాల్ ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించడంతో ఆదివారం చార్ధామ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. జూలై 7, 8 తేదీల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. యాత్రికుల భద్రత దృష్ట్యా యాత్రను వాయిదా వేస్తున్నట్లు గర్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే తెలిపారు. ఈ రెండు రోజుల్లో గర్వాల్ డివిజన్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.…
Zimbabwe Captain Sikandar Raza History in T20 Cricket: జింబాబ్వే కెప్టెన్ సికిందర్ రజా చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డులు గెలుచుకున్న రెండో ఆటగాడిగా నిలిచాడు. ఈ జాబితాలో టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్‌తో కలిసి సంయుక్తంగా రెండో స్థానంలో నిలిచాడు. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం భారత్‌తో జరిగిన మొదటి టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా రజా నిలిచాడు. 19 బంతుల్లో…
Zimbabwe Record vs India: పసికూన జింబాబ్వే ఓ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకుంది. టీ20ల్లో భారత్‌పై అత్యల్ప స్కోరును డిఫెండ్ చేసుకున్న జట్టుగా రికార్డులో నిలిచింది. ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా శనివారం హరారే వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందడం ద్వారా జింబాబ్వే ఖాతాలో ఈ రికార్డు చేరింది. 116 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని జింబాబ్వే బౌలర్లు కాపాడుకున్నారు. ఇంతకుముందు ఈ రికార్డు న్యూజిలాండ్ పేరిట ఉండేది. 2016లో నాగ్‌పూర్ వేదికగా టీమిండియాతో…
జింబాబ్వే టూర్లో పలువురు యువ ఆటగాళ్లకు బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ అవకాశం కల్పించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్ వేదికగా శనివారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా ఓటమి చవిచూడాల్సి వచ్చింది. ఈ పర్యటనలో భారత జట్టుకు నాయకత్వం వహిస్తున్న శుభ్‌మన్ గిల్ మొదటి మ్యాచ్‌లో ముగ్గురు ఆటగాళ్లకు అరంగేట్రం చేసే అవకాశం ఇచ్చాడు. కానీ ఈ ముగ్గురిలో ఎవరూ బ్యాటింగ్ లో రాణించలేకపోయారు. తొలి మ్యాచ్‌లో అభిషేక్ శర్మ, రియాన్ పరాగ్, ధ్రువ్ జురైల్లు టీమిండియా…
ఐదు టీ20ల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్‌లో జింబాబ్వే 13 పరుగుల తేడాతో భారత్‌పై విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో శుభ్‌మన్ గిల్, వాషింగ్టన్ సుందర్ మినహా భారత బ్యాట్స్మెన్లు ఎవరూ రాణించలేదు. ఈ క్రమంలో.. 102 పరుగులకే ఆలౌటైంది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన జింబాబ్వే 115 పరుగులు చేసింది. భారత్ తక్కువ పరుగులకే కట్టడి చేసిందని.. 116 పరుగుల లక్ష్యాన్ని ఈజీగానే సాధిస్తుందని అనుకున్నారు. కానీ.. అంతా రివర్స్ అయిపోయింది. జింబాబ్వే బౌలర్ల…
జింబాబ్వేతో జరుగుతున్న తొలి టీ20 మ్యాచ్ లో భారత్ తక్కువ స్కోరుకే కట్టడి చేసింది. టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేయడంతో జింబాబ్వే 115 పరుగులు మాత్రమే చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి ఈ పరుగులు సాధించింది.