భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య వన్డే సిరీస్ ముగిసింది. మూడు వన్డేల సిరీస్‌ను కివీస్ 2-1తో కైవసం చేసుకుంది. గతంలో భారత గడ్డపై టీమిండియాను టెస్టుల్లో ఓడించిన న్యూజిలాండ్.. ఇప్పుడు వన్డేల్లో కూడా ఓడించింది. ఇరు జట్ల మధ్య బుధవారం (జనవరి 21) నుంచి ఐదు టీ20ల సిరీస్ ఆరంభం కానుంది. తొలి మ్యాచ్ నాగ్‌పూర్‌లో జరగనుంది. ఈ పొట్టి సిరీస్ రెండు జట్లకు టీ20 ప్రపంచకప్ 2026 సన్నాహకంగా ఉపయోగపడనుంది. టీ20ల్లోనూ రెండు జట్ల మధ్య…