భారత క్రికెట్ నియంత్రణ మండలి ఆస్ట్రేలియా పర్యటన కోసం భారత అండర్-19 జట్టును ప్రకటించింది. జట్టు కమాండ్ బాధ్యతలను మరోసారి కెప్టెన్ ఆయుష్ మాత్రేకు అప్పగించారు. విహాన్ మల్హోత్రాను వైస్-కెప్టెన్‌గా నియమించారు. ఇంగ్లాండ్ పర్యటనలో అద్భుతంగా రాణించిన ఓపెనర్ వైభవ్ సూర్యవంశీని కూడా జట్టులో స్థానం సంపాదించాడు. ఈ పర్యటన సెప్టెంబర్ 21 నుంచి ప్రారంభమై అక్టోబర్ 10 వరకు కొనసాగుతుంది. భారత్- ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో మూడు వన్డేలు, రెండు నాలుగు రోజుల మ్యాచ్‌లు ఆడనుంది.…