ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో పర్యటిస్తున్నారు. పర్యటనలో భాగంగా పలువురు ముఖ్య నేతలను కలవనున్నారు. మరోవైపు.. “ఇండియా టుడే” మీడియా సంస్థ నిర్వహించిన కాంక్లేవ్ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ.. మీరు కన్ఫ్యూజ్ అయినట్టే మేము మూడు లక్షల కోట్లే అప్పు అనుకున్నాం.. కానీ లెక్కలు చూస్తే రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని అన్నారు.