Dalai Lama: దలైలామా ఉనికి లేకుండా చేసేందుకు డ్రాగన్ కంట్రీ ఎప్పటి నుంచో ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలోనే.. దలైలామా పునర్జన్మను ఆమోదించాలని చైనా డిమాండ్ చేసింది. ఈ ప్రకటనపై భారత్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. టిబెటన్ ఆధ్యాత్మక గురువు దలైలామాకు తప్పా తన వారసుడిని నిర్ణయించే హక్కు ఎవరికీ లేదని భారత్ చెప్పింది.