150 కోట్లకు పైగా జనాభా ఉన్న ఇండియాలో ప్రతిభకు ఏ మాత్రం కొదవ లేదు. అందుకే టెక్ ప్రపంచంలో భారతీయులు దూసుకుపోతున్నారు. తాజాగా ట్విటర్ సీఈవోగా భారత సంతతికి చెందిన వ్యక్తి పరాగ్ అగర్వాల్ నియమితులయ్యారు. ఈ నేపథ్యంలో భారతీయుల ఘనతపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. గూగుల్, మైక్రోసాఫ్ట్, అడోబ్, ఐబీఎం, పాలో ఆల్టో నెట్‌వర్క్స్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీలకు గతంలో భారతీయులు పెద్ద పెద్ద పొజిషన్‌లలో నియమింపబడ్డారు. ఇప్పుడు సోషల్ మీడియాలో…