CMS-03: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశంలోనే అత్యంత బరువైన కమ్యూనికేషన్ శాటిలైట్ CMS-03ను ప్రయోగానికి సిద్ధమైంది. నవంబర్ 2 ఆదివారం రోజున శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి శాటిలైట్ ప్రయోగం జరుగనుంది. ఇది మల్టీ బ్యాండ్ మిలిటరీ కమ్యూనికేషన్ శాటిలైట్. దీనిని GSAT-7R అని కూడా పిలుస్తారు. ఈ ఉపగ్రహాన్ని ఇస్రో అత్యంత శక్తివంతమైన రాకెట్ అయిన లాంచ్ వెహికల్ మార్క్ 3 (LVM3) ద్వారా ప్రయోగించనున్నారు.
ఆదివారం ఉదయం భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) 101వ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. తాజా భూమి పరిశీలన ఉపగ్రహ మిషన్‌కు ఎదురుదెబ్బ తగిలింది. నింగిలోకి దూసుకెళ్లిన కాసేపటికే సాంకేతిక సమస్య తలెత్తింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం నుంచి ఉదయం 5:59 గంటలకు PSLV-C61 రాకెట్ ప్రయోగించిన తర్వాత EOS-09 మిషన్ పూర్తికాలేదని ఇస్రో (ISRO) ధృవీకరించింది. ఫలితాన్ని ఉద్దేశించి ఇస్రో చైర్మన్ వి. నారాయణన్ ఇలా అన్నారు.. “EOS-09 మిషన్ పూర్తికాలేదు.” “మేము విశ్లేషణ…