రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నూతన విదేశాంగ విధాన సిద్ధాంతాన్ని శుక్రవారం ఆమోదించారు. ఆ విధానం ప్రకారం రష్యా యురేషియాలో భారతదేశంతో తన వ్యూహాత్మక భాగస్వామ్యం, వాణిజ్య సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి సారించింది.
Crude Oil : ఉక్రెయిన్‌పై యుద్ధం తరువాత, ప్రపంచంలోని అనేక దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధించాయి. దీన్ని ఎదుర్కోవడానికి, రష్యా తన మిత్రదేశాలకు తగ్గింపు ధరలకు ముడి చమురును సరఫరా చేయడానికి ముందుకొచ్చింది.
Singapore PM comments on India abstained from UN voting on Russia’s invasion: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన పలు తీర్మాణాలకు భారత్ దూరంగా ఉంది. అయితే దీనిపై సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఆదివారం కామెంట్స్ చేశారు. భారత్, రష్యా నుంచి సైనిక సామాగ్రిని కొనుగోలు చేస్తోందని అందుకనే భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మాణాల్లో భారత్ తటస్థత పాటించిందని ఆయన అన్నారు. సింగపూర్ ప్రజలను…
మొదటి నుంచి భారత్-రష్యా మైత్రి ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఈ రెండు దేశాల మధ్య వాణిజ్య, వ్యాపార సంబంధాలు కూడా అంతే ప్రత్యేకమైనవి. రష్యా అధ్యక్షడు వ్లాదిమిర్ పుతిన్ నేడు భారత్‌కు రానున్నారు. రెండు దేశాల మధ్య జరిగే 21వ వార్షిక సదస్సులో ఆయన పాల్గొంటారు. అంతేకాకుండా భారత్ ప్రధాని నరేంద్రమోడీతో ప్రత్యేకంగా భేటీ అవ్వనున్నారు. వీరి సమావేశానికి ముందు ఇరు దేశాల రక్షణ, విదేశాంగశాఖ ప్రతినిధులు చర్చలు జరుపుతారు. ఈ నేపథ్యంలో పలు కీలక…
అఫ్ఘనిస్థాన్ ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడంతో అక్కడి పరిస్థితులన్నీ గంటగంటకు మారిపోతున్నాయి. సెప్టెంబర్ 11న తాలిబన్లు తమ తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేయనుండడటంతో ప్రపంచ మొత్తం అఫ్ఘన్ వైపే చూస్తోంది. తాలిబన్లు గద్దెనెక్కక ముందే వారు వ్యవహరిస్తున్న తీరు ప్రపంచానికి పెను సవాలుగా మారుతోంది. తాలిబన్లు తమ మిత్రదేశాలుగా చైనా, పాకిస్థాన్ ను మాత్రమే ప్రకటించాయి. వీరి చర్యలు భారత్, రష్యా, అమెరికా దేశాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ దేశాలకు చెందిన…