Singapore PM Lee Hsien Loong: ఇండియా అందుకనే రష్యా వ్యతిరేక తీర్మానాలకు దూరంగా ఉంది.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Singapore PM comments on India abstained from UN voting on Russia’s invasion: ఉక్రెయిన్- రష్యా యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాలకు భారత్ దూరంగా ఉంది. అయితే దీనిపై సింగపూర్ ప్రధాని లీ సీన్ లూంగ్ ఆదివారం కామెంట్స్ చేశారు. భారత్, రష్యా నుంచి సైనిక సామాగ్రిని కొనుగోలు చేస్తోందని అందుకనే భద్రతా మండలిలో రష్యాకు వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన తీర్మానాల్లో భారత్ తటస్థత పాటించిందని ఆయన అన్నారు. సింగపూర్ ప్రజలను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తున్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
గత ఫిబ్రవరిలో అమెరికా, ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న దాడులకు ప్రతిగా తీర్మాణాన్ని ప్రవేశపెట్టింది. అయితే ఆ సమయంలో భారత్ ఈ తీర్మానానికి దూరంగా ఉంది. ఇరు దేశాలు చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశం అయిన రష్యా ఫిబ్రవరిలో భద్రతామండలి అధ్యక్షుడిగా ఉండటంతో వీటో అధికారాన్ని ఉపయోగించి తీర్మానం ఆమోదించకుండా అడ్డుకుంది. ఆ సమయంలో భారత్ , రష్యా, వియత్నాం, లావోస్ దేశాలు తీర్మాణానికి దూరంగా ఉన్నాయి.
Also Read
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
- DA Hike: దసరా పండగ వేళ వారికి శుభవార్త చెప్పిన కేంద్ర ప్రభుత్వం.. డీఏ పెంపు..
Read Also: Assam: అల్ ఖైదాతో సంబంధాలు.. ఇద్దరు ఇమామ్‌ల అరెస్ట్..
ఆసియాన్ లో అతి చిన్న దేశం సింగపూర్ ఆసక్తులు, ప్రాముఖ్యతలు సహజంగా ఇతరుకలు భిన్నంగా ఉంటాయని ఆయన అన్నారు. సింగపూర్, రష్యా దండయాత్రను ఖండించమే కాకుండా.. ఆంక్షలను విధించేందుకు ముందుకు వెళ్లిందని లీసింగ్ లూంగ్ అన్నారు. ఉక్రెయిన్ పై దాడిని ఖండించడంలో సింగపూర్, అమెరికా వైపు కానీ రష్యా వైపు కానీ పక్షపాతం చూపడం లేదని అన్నారు. ఉక్రెయిన్ పై దాడిని సింగపూర్ ఖండించకపోతే.. ఒక రోజు మనపై దాడి చేస్తే సింగపూర్ వైపు కూడా ఎవరూ నిలబడరని ఆయన అన్నారు.
మార్చిలో ఉక్రెయిన్ మానవతా సంక్షోభంపై రష్యా చేసిన ముసాయిదా తీర్మానంపై కూడా భారత్ గైర్హాజరైంది. ఆ సమయంలో రష్యా, చైనా తీర్మాణానికి మద్దతుగా ఓటేయగా.. భారత్ తో సహా 13 దేశాలు దూరంగా ఉన్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా దాడికి సంబంధించిన తీర్మానాలకు భారత్ గతంలో భద్రతా మండలిలో రెండు పర్యాయాలు, జనరల్ అసెంబ్లీలో ఒకసారి గైర్హాజరైంది.
తాజావార్తలు
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్వే.. 1,107 కి.మీ. గ్రీన్ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
-
TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
-
Amazon Great Indian Festival Sale: రూ.6 వేలకే 200 ఇంచుల ‘స్మార్ట్ ప్రొజెక్టర్’.. అమెజాన్ సేల్లో అదిరిపోయే ఆఫర్..!
-
Tollywood : ఇండస్ట్రీ ఆశలన్నీ అక్టోబర్ తీరుస్తుందా?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!