భారతదేశం నుంచి మందుగుండు సామగ్రి ఉక్రెయిన్‌కు చేరుతోందని అంతర్జాతీయా వార్తా సంస్థ రాయిటర్స్ కథనంపై భారత ప్రభుత్వం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాయిటర్స్ నివేదికపై మీడియా ప్రశ్నలకు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. ‘మేము రాయిటర్స్ నివేదికను చూశాం. ఇది ఊహాజనిత, తప్పుదారి పట్టించే వార్త. ఇది భారతదేశ నిబంధనల ఉల్లంఘనను సూచిస్తుంది. దీనిని ఖండిస్తున్నాం.” అని పేర్కొన్నారు.
READ MORE: Amitabh Bachchan: మరాఠీవాసులకు అమితాబ్ బచ్చన్ క్షమాపణలు.. ఎందుకంటే?
ఐరోపా దేశాలకు పంపిన రక్షణ వస్తువులు ఉక్రెయిన్‌కు చేరుతున్నాయని రాయిటర్స్ నివేదిక పేర్కొంది. ఉక్రెయిన్‌కు సంబంధించిన రాయిటర్స్ నివేదికను భారత్ తిరస్కరించింది. ఈ వార్తల కారణంగా భారత్, మిత్ర దేశం రష్యా మధ్య చిచ్చు రేగే అవకాశం ఉంది. అయితే, మిలిటరీ మరియు ద్వంద్వ వినియోగ వస్తువుల ఎగుమతిపై అంతర్జాతీయ బాధ్యతలను పాటించడంలో భారతదేశం తప్పుపట్టలేని ట్రాక్ రికార్డ్ కలిగి ఉందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. అణ్వస్త్ర వ్యాప్తి నిరోధంపై తన అంతర్జాతీయ బాధ్యతలకు అనుగుణంగా, చట్టపరమైన నియంత్రణ ఫ్రేమ్‌వర్క్ ఆధారంగా భారత్ తన రక్షణ ఎగుమతులను కొనసాగిస్తోందని తెలిపింది. తుది వినియోగదారు జవాబుదారీతనం, ధృవీకరణతో సహా సంబంధిత నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలిస్తుందని పేర్కొంది.
READ MORE:US: అమెరికాలో ఏపీ విద్యార్థి గుండెపోటుతో మృతి.. విషాదంలో కుటుంబ సభ్యులు
రాయిటర్స్ తన కథనంలో ఇలా పేర్కొంది. “భారత్, ఐరోపా ప్రభుత్వాల మధ్య జరిగిన డిఫెన్స్ ఇండస్ట్రీ ఒప్పందం ప్రకారం.. తయారైన షెల్స్ యూరప్ దేశాలకు పంపడం గమనార్హం. భారతీయ ఆయుధ తయారీదారులు విక్రయించే ఫిరంగి ఆయుధాలను యూరోపియన్ కస్టమర్లు ఉక్రెయిన్‌కు పంపారు. మాస్కో నుంచి వ్యతిరేకత ఉన్నప్పటికీ, వాణిజ్యాన్ని ఆపడానికి న్యూఢిల్లీ జోక్యం చేసుకోలేదు. మూలాలు, కస్టమ్స్ డేటా ప్రకారం.. రష్యాకు వ్యతిరేకంగా ఉక్రెయిన్‌కు మందుగుండు సామగ్రిని పంపే పని ఒక సంవత్సరానికి పైగా కొనసాగుతోంది. భారతీయ ఆయుధాల ఎగుమతి నియమాలు ఆయుధాల వినియోగాన్ని ప్రకటించిన కొనుగోలుదారులకు మాత్రమే పరిమితం చేస్తాయి. ఇందులో అక్రమ కొనుగోలు మరియు అమ్మకాలు జరిగితే భవిష్యత్తులో అమ్మకాలు ముగిసే ప్రమాదం ఉంది.” అని రాయిటర్స్ పేర్కొంది.