తెలుగు సినీ ప్రేక్షకులకు సుపరిచితురాలైన నటి ప్రగతి కేవలం వెండితెరపైనే కాదు, క్రీడా రంగంలోనూ తన ప్రతిభను చాటుతున్నారు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి, సకుటుంబ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న ప్రగతి, పవర్ లిఫ్టింగ్ క్రీడలో జాతీయ స్థాయిలో వరుస పతకాలతో అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారు. ఈ విజయాల పరంపరలో భాగంగా, ఆమె రేపు టర్కీలో జరగనున్న ఏషియన్ గేమ్స్ (ఆసియా క్రీడలు) లో పాల్గొనబోతున్నారు. నటిగా ఎంత ప్రతిభావంతురాలో, పవర్ లిఫ్టింగ్‌లోనూ అంతకంటే ఎక్కువ…