SIR: ఇటీవల బీహార్ రాష్ట్రంలో కేంద్రం ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) అమలు చేయడం సంచలనంగా మారింది. అక్రమ ఓటర్ల గుర్తించి, ఎన్నికల జాబితా నుంచి వారి పేర్లను తొలగిస్తోంది. అయితే, ఈ ప్రక్రియను ప్రతిపక్షాలైన కాంగ్రెస్, ఆర్జేడీ వంటి పార్టీలు తీవ్రంగా వ్యతిరేకిస్తూ, ఎన్నికల కమిషన్‌పై విమర్శలు చేస్తున్నాయి. బీజేపీ-ఈసీ కలిసి ఓట్ల చోరీకి పాల్పడుతోందని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ ఆరోపించారు.
PM Modi: భారత తొలి ప్రధాన మంత్రి జవహర్‌లాల్ నెహ్రూ భారత దేశాన్ని రెండుసార్లు విభజించారని పీఎం మోడీ ఆరోపించారు. ఒకసారి రాడ్‌క్లిఫ్ లైన్‌తో విభజించగా.. మన దేశానికి చెందిన సింధూ నదిని ముక్కలు చేసి మరోసారి విడగొట్టారన్నారు.
వక్ఫ్ బోర్డు బిల్లుపై పార్లమెంటులో రాహుల్ గాంధీ వెన్నుచూపారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడారు. మైనారిటీలపై కాంగ్రెస్ కపట ప్రేమ చూయిస్తుందని ఆరోపించారు. దేశవ్యాప్తంగా మైనారిటీల హక్కులను కాలరాసి కీలకమైన వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై చర్చలో లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ మాట్లాడకపోవడం దారుణమన్నారు. ప్రియాంక గాంధీ అతి ముఖ్యమైన ఈ బిల్లు సమయంలో పార్లమెంటుకు హాజరు కాకపోవడం అత్యంత దారుణమని…
లోక్‌సభలో వక్ఫ్ సవరణ బిల్లుపై చర్చలో పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరుల నియామకంపై స్పష్టత ఇచ్చారు. ప్రతిపక్ష సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలను, తప్పుడు ప్రచారాలను తోసిపుచ్చుతూ.. వక్ఫ్ బోర్డులో ముతవల్లీ ముస్లిం మాత్రమే ఉంటారని తెలిపారు. అన్యమతానికి చెందిన ఏ సభ్యుడినీ అనుమతించబోమని చెప్పారు. కొత్త చట్టం ప్రకారం.. వక్ఫ్ బోర్డులోని ముస్లిమేతరులు మతపరమైన విషయాల్లో జోక్యం చేసుకోరని హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు.
CM Revanth Reddy : తన పరిపాలనా నైపుణ్యం.. ప్రభావంతమైన రాజకీయంతో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అత్యంత శక్తిమంతమైన నాయకునిగా నిలిచారు. ద ఇండియన్ ఎక్స్‌ప్రెస్ 2025 సంవత్సరానికి సంబంధించి దేశంలోని వివిధ రంగాల్లో అత్యధిక శక్తిమంతులైన 100 మంది ప్రముఖులతో జాబితా విడుదల చేసింది. ఈ జాబితాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 28వ స్థానం దక్కించుకున్నారు. 2024 సంవత్సరపు జాబితాలో 39 స్థానంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడాది కాలంలోనే ఏకంగా 11…
రాజీవ్ గాంధీపై కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలతో పార్టీని ఇరుకున పెట్టారు. దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ రెండు సార్లు పరీక్షల్లో ఫెయిల్ అయ్యారన్నారు. అలాంటి వ్యక్తి దేశానికి ప్రధాన మంత్రి ఎలా అయ్యారో అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ అంశంపై దుమారం రేగుతోంది.
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై బీజేపీ ఎంపీ సంబిత్ పాత్రా తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని ఉన్నత స్థాయి ద్రోహిగా అభివర్ణించారు. భారతదేశాన్ని అస్థిరపరిచేందుకు ప్రయత్నిస్తున్న ప్రమాదకరమైన ముక్కోణపు బంధం గురించి మాట్లాడబోతున్నామని బీజేపీ నేత అన్నారు
కేంద్ర మాజీ మంత్రి, భారతీయ జనతా పార్టీ నాయకుడు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ ముస్లింలకు పెద్ద విజ్ఞప్తి చేశారు. బీజేపీని విశ్వసించాలని శుక్రవారం నఖ్వీ ముస్లిం సమాజాన్ని కోరారు.
దేశంలో రాజకీయాల గతిని మార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్. బీజేపీ నిరంకుశ విధానాలు, ప్రస్తుత రాజకీయాలు, భవిష్యత్ కార్యాచరణపై వివిధ రాష్ట్రాల సీఎంల మద్దతు కూడగడుతున్నారు కేసీఆర్. తన పోరును జాతీయ స్థాయికి తీసుకెళ్లే వ్యూహంలో భాగంగా ముంబైలో మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేతో ఆదివారం కీలక సమావేశం నిర్వహించారు. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన సమావేశంలో వీరిద్దరి మధ్య పలు అంశాలు చర్చించారని తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వ విధానాలపై కేసీఆర్, ఉద్ధవ్ ఠాక్రే…