Mohan Bhagwat : ఆపరేషన్ సిందూర్ పై దేశ వ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆర్ ఎస్ ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉగ్రవాదులను అంతమొందించేందుకు ఇండియన్ ఆర్మీ చేసిన ఆపరేషన్ సిందూర్ దేశ గౌరవాన్ని, ధైర్యాన్ని పెంచిందంటూ ప్రకటించారు. కర్ణాటకలోని బెలగావిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సిందూర్ పహల్గాం బాధితులకు అసలైన నివాళి అంటూ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా దేశ త్రివిధ దళాలను ఆయన ప్రశంసించారు.…
India-Pak War : దాయాది పాక్ మళ్లీ కాల్పులకు తెగబడుతోంది. శుక్రవారం రాత్రి 9గంటల సమయంలో మరోసారి కాల్పులకు తెగబడింది. ఈ క్రమంలోనే శ్రీ నగర్ లో లైట్లు ఆర్పేసి బ్లాకౌట్ నిర్వహించడానికి సైనికులు నిర్ణయించారు. ఇదే విషయం ప్రజలకు చెప్పడానికి మసీదు లౌడ్ స్పీకర్లను ఉపయోగించారు. ‘జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా తన ఎక్స్ వేదికగా ఓ ట్వీట్ చేశారు. శ్రీ నగర్ లో మొత్తం బ్లాకౌట్. కానీ భారీ పేలుళ్ల శబ్దాలు వినిపిస్తున్నాయి.…
India-Pak War : భారత్-పాకిస్థాన్ యుద్ధ వాతవారణ సమయంలో దేశ వ్యాప్తంగా అన్ని రకాల నిత్యవసరాలపై కేంద్రం కీలక సూచనలు చేసింది. దేశ వ్యాప్తంగా నిత్యవసర సరుకుల విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పింది. దేశ వ్యాప్తంగా కావాల్సినన్ని నిత్యవసర సరుకుల నిల్వలు ఉన్నట్టు ప్రకటించింది. ఎవరూ పరిమితికి మించి నిల్వలు చేయొద్దని ఆదేశించింది. ఈ విషయంలో కేంద్రం అన్ని రాష్ట్రాల ఆహార అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వాలు కీలక…
India-Pak War : ఇండియా-పాకిస్థాన్ యుద్ధ పరిస్థితులపై తాజాగా విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి సంచలన ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా విక్రమ్ మిస్రీ మాట్లాడుతూ.. ‘పాకిస్థాన్ మన దేశ సైనిక స్థావరాలు, నాలుగు ఎయిర్ పోర్టులే లక్ష్యంగా దాడులు చేసింది. మన దేశంలోని గురుద్వారాలపై దాడులు చేసి దేశంలో మత ఘర్షణలు సృష్టించాలని కుట్ర చేసింది. పాక్ ప్రయత్నాలను ఇండియన్ ఆర్మీ బలంగా…
Uttam Kumar Reddy : పాకిస్థాన్ తో భారత్ యుద్ధ నేపథ్యంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ దొంగ దాడులను ఇండియన్ ఆర్మీ ధీటుగా ఎదుర్కుందని ప్రశంసించారు. పూర్తి స్థాయి యుద్ధమే వస్తే.. అవసరం అయితే వెళ్లి బార్డర్ లో యుద్ధంలో పాల్గొంటానని సంచలన ప్రకటన చేశారు. ఇలాంటి క్లిష్ట సమయంలో మన ఇండియన్ ఆర్మీ సాహసాన్ని చూసి దేశం గర్విస్తోందని తెలిపారు. ‘పహల్గాంలో పాకిస్థాన్ ప్రేరేపిత టెర్రరిస్టులు అత్యంత ఘాతుకానికి…
ISRO : భారత్-పాకిస్థాన్ యుద్ధం నేపథ్యంలో దేశంలోని ప్రముఖ ప్రదేశాల్లో, సెంటర్లు, ప్రభుత్వ కార్యకలాపాల వద్ద భారీగా భద్రత పెంచుతున్నారు. ఈ క్రమంలోనే ఇస్రో కేంద్రాల వద్ద భారీగా భద్రత పెంచుతున్నారు. బెంగుళూరు, శ్రీహరి కోటతో సహా 11 ఇస్రో కేంద్రాల్లో, ఇతర కార్యాలయాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు. ఇస్రో కేంద్రాల దగ్గర సీఐఎస్ఎఫ్ సిబ్బంది సంఖ్యను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ఇవే కాకుండా ప్రముఖ రీ సెర్చ్ సెంటర్ల వద్ద కూడా…
Rashmika : పాకిస్థాన్ మీద ఇండియా సాగిస్తున్న యుద్ధానికి దేశ ప్రజల నుంచి భారీ మద్దతు లభిస్తోంది. ఈ సందర్భంగా చాలా మంది సెలబ్రిటీలు ఆర్మీకి సపోర్టుగా పోస్టులు పెడుతున్నారు. తాజాగా హీరోయిన్ రష్మిక కూడా మద్దతు తెలుపుతూ పోస్టు పెట్టింది. టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడటం మన హక్కు అంటూ తెలిపింది. చాలా మంది అమాయక పౌరులను చంపితే కచ్చితంగా న్యాయం చేయాల్సిందే అంటూ చెప్తోంది. టెర్రరిస్టల దాడిలో అమాయకులు చనిపోతే.. కచ్చితంగా దానికి బదులు తీర్చుకోవాలని..…
India Pak War: పాకిస్తాన్ జమ్మూ సహా పశ్చిమ సరిహద్దు వద్ద ఉన్న భారత సైనిక స్థావరాలపై దాడి ప్రయత్నాలు చేసింది. కానీ భారత వైమానిక రక్షణ వ్యవస్థ వాటిని విజయవంతంగా తిప్పికొట్టింది. భారత్, పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ.. భారత మాజీ క్రికెట్ లెజెండ్ వీరేంద్ర సెహ్వాగ్ పాకిస్తాన్‌ను తీవ్రంగా విమర్శించారు. శాంతిగా ఉండే అవకాశం ఉన్నప్పుడు యుద్ధాన్ని ఎంచుకుంది అంటూ సెహ్వాగ్ తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు. Read Also: Ind…
Pakistan Minister: నేడు ఉదయం జరిగిన “ఆపరేషన్ సింధూర్” ద్వారా భారత దేశ రక్షణ శాఖ కీలక విజయాన్ని సాధించింది. ఈ ఆపరేషన్‌లో భారత్, పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై లక్ష్యంగా మిస్సైల్స్‌తో దాడి నిర్వహించింది. ఇందులో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ కుటుంబ సభ్యులతో పాటు పలువురు ముఖ్య ఉగ్రవాదులు మృతి చెందారు. ఉగ్రవాద నిర్మూలనలో ఇది ఒక పెద్ద ముందడుగు అని భారత వర్గాలు పేర్కొన్నాయి. ఈ దాడి తర్వాత పాకిస్థాన్ లో సంచలనం…