Pinaki Bhattacharya: షేక్ హసీనా బంగ్లాదేశ్ ప్రధానిగా రాజీనామా చేసి, దేశం వదిలిపారిపోయేలా చేసేందుకు కుట్ర జరిగిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. షేక్ హసీనాను భారత్ కీలుబొమ్మగా పోలుస్తూ, అడుగడుగున భారత వ్యతిరేకత నింపుకున్న వ్యక్తి ‘పినాకి భట్టాచార్య’. ఫ్రాన్స్‌లో ఉంటున్న ఇతను అక్కడ నుంచే షేక్ హసీనాకు వ్యతిరేకంగా వీడియోలు చేస్తూ దేశంలో అగ్గిరాజేందుకు కీలకంగా వ్యవహరించాడు.