ఆసియా క్రీడల్లో పురుషుల హాకీ జట్టు సత్తా చాటింది. పురుషుల హాకీలో భారత్ మరోసారి ఆసియా ఛాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో జపాన్‌పై విజయం సాధించి స్వర్ణం కైవసం చేసుకుంది. టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన తర్వాత, హాంగ్‌జౌలో జరిగిన ఆసియా క్రీడల్లో సంచలన ప్రదర్శనతో హాకీ జట్టు భారత కీర్తి పతాకాన్ని ఎగరేసింది.