ఇండియన్, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సినిమాలు, డ్రామాలు నిర్మించాలని ప్రముఖ కొరియన్ దర్శక నిర్మాత యూ ఇన్-షిక్ఆకాంక్షించారు. న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్‌లోని కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన ఈ విషయం వెల్లడించారు. బంజారా హిల్స్‌లోని ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. కొరియన్ యాక్టింగ్ అంబాసిడర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ,…
56వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా (IFFI) వేడుకల్లో విశేషం చోటుచేసుకుంది. గోవాలో నిర్వహిస్తున్న ఈ ప్రతిష్ఠాత్మక వేడుక ప్రారంభోత్సవ కార్యక్రమంలో కొరియా రిపబ్లిక్ నేషనల్ అసెంబ్లీ సభ్యురాలు జావెన్ కిమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భారతీయులకు ఎంతో గర్వకారణమైన ‘వందేమాతరం’ గేయాన్ని ఆమె స్టేజ్‌పై అద్భుతంగా ఆలపించి కార్యక్రమానికి హాజరైన వారిని అబ్బురపరిచారు. కొరియన్ మినిస్టర్ స్వరంలో వచ్చిన వందేమాతరం శ్రోతల్లో దేశభక్తి స్పూర్తిని నింపగా, అక్కడి వేదికపై ప్రేక్షకులు ఘనంగా చప్పట్లతో స్పందించారు.…