ఇండియన్, ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో సినిమాలు, డ్రామాలు నిర్మించాలని ప్రముఖ కొరియన్ దర్శక నిర్మాత యూ ఇన్-షిక్ఆకాంక్షించారు. న్యూఢిల్లీలోని కొరియా రిపబ్లిక్ రాయబార కార్యాలయం, కొరియన్ ఫిల్మ్ కౌన్సిల్ భాగస్వామ్యంతో, హైదరాబాద్‌లోని కొరియా గౌరవ కాన్సులేట్ జనరల్ నిర్వహించిన మూడవ కొరియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆయన ఈ విషయం వెల్లడించారు. బంజారా హిల్స్‌లోని ఎల్.వి. ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్స్‌లో ఈ కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది.
కొరియన్ యాక్టింగ్ అంబాసిడర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, హైదరాబాద్ రావడం సంతోషంగా ఉందని, భవిష్యత్తులో సంస్కృతి, వినోద రంగాలలో కొరియా-ఇండియా మధ్య సహకారం (కొలాబరేషన్) పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కొరియా గౌరవ కాన్సుల్ జనరల్ సురేష్ చుక్కపల్లి మాట్లాడుతూ, భారతదేశం, కొరియా మధ్య అనేక సాంస్కృతిక సారూప్యతలు ఉన్నాయని తెలిపారు. “వాళ్లందరూ మనలాగే చాలా ఫ్యామిలీ ఓరియెంటెడ్**గా ఉంటారు. పెద్దలకి, కల్చర్ కి, మూలాలకి గౌరవిస్తారు,” అని అన్నారు. భారతదేశంలో కొరియన్ డ్రామాలకు ఉన్న విశేష ఆదరణను ప్రస్తావిస్తూ, “ఇండియాకి **లార్జెస్ట్ వ్యూవర్ షిప్** ఉంది. కొరియన్ వెబ్ సిరీస్‌లు, సినిమాలు తెలుగు, హిందీలో ట్రాన్స్‌లేట్ అవుతున్నాయి. ఇండియాలో పిల్లలు, గృహిణులు కొరియన్ డ్రామాలు చూస్తున్నారు,” అని చుక్కపల్లి పేర్కొన్నారు.
అలాగే, కొరియన్ మేకర్స్‌ను హైదరాబాద్‌లో షూటింగ్‌లు చేసుకోవాలని ఆహ్వానించారు. “ఈ రోజుల్లో కొరియాలో షూటింగ్ చాలా ఖరీదైంది. మనం **బాహుబలి, ఆర్ఆర్ఆర్** లాంటి అద్భుతమైన సినిమాలు హైదరాబాద్‌లోనే చేశాం. ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు ఉన్నాయి. కొరియన్ మేకర్స్ హైదరాబాద్‌లో షూట్ చేసుకునేలా అన్ని సౌకర్యాలు కల్పించాలనేది మా ఉద్దేశం. ఇండియన్, కొరియన్ కొలాబరేషన్ లో భవిష్యత్ లో ప్రాజెక్ట్స్ రావాలని కోరుకుంటున్నాం,” అని చుక్కపల్లి సురేష్ అన్నారు.