దేశంలో వైద్య విద్య సామర్థ్యాన్ని విస్తరించేందుకు కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేబినేట్, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్ (CSS) దశ-3 కింద కొత్త సీట్ల మంజూరుకు ఆమోదం తెలిపింది. క్యాబినేట్ నిర్ణయంతో ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రులు, పీజీ ఇనిస్టిట్యూట్లలో 5,000 పీజీ సీట్లు, 5,023 ఎంబీబీఎస్ సీట్లు పెరుగనున్నాయి. ఒక్కో సీటుకు రూ.1.50 కోట్లు వరకు ఖర్చు చేయడానికి కేంద్ర క్యాబినెట్ అనుమతించింది. కొత్త సీట్ల పెంపుతో…
హెల్త్ కేర్ టెక్నాలజీలో అగ్రగామిగా ఉన్న ఫ్యూజీఫిల్మ్ ఇండియా తాజాగా ‘త్వరగా గుర్తించండి, త్వరగా పోరాడండి’ అనే సీఎస్ఆర్ ప్రచారం ప్రారంభించింది. అపోలో హాస్పిటల్స్ సీఎస్ఆర్ విభాగం వైస్ ఛైర్‌పర్సన్ ఉపాసనా కామినేని కొణిదెల దీన్ని ప్రారంభించారు. రొమ్ము క్యాన్సర్‌పై అవగాహన కల్పించి, దాన్ని త్వరగా గుర్తించాల్సిన అవసరంపై ఈ ప్రచారం ముఖ్య ఉద్దేశం. దేశంలోని 24 నగరాల్లో ఈ ప్రచారం ఉంటుంది. ఇది మొత్తం 1.5 లక్షల మంది మహిళలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా…
Rainbow Childrens Hospital: విశాఖపట్నంలోని రెయిన్‌బో చిల్డ్రన్స్ హాస్పిటల్ పీడియాట్రిక్ నిపుణుల బృందం నగరంలోని ఎల్‌వి ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్ సహకారంతో కేవలం 33 వారాల నెలలు నిండని కవల శిశువును కాపాడే శస్త్రచికిత్సలను విజయవంతంగా నిర్వహించారు. కేవలం 1.5 కిలోల బరువున్న శిశువుకు పుట్టుకతో వచ్చే గ్లాకోమా, తీవ్రమైన గుండె పరిస్థితిని గుర్తించారు. కేవలం 14 రోజుల వయస్సులో, శిశువుకు PDA (పేటెంట్ డక్టస్ ఆర్టెరియోసస్) లిగేషన్ కార్డియాక్ సర్జరీ జరిగింది. ఈ సున్నితమైన ప్రక్రియ…