బీహార్‌లో తొలి దశ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఓటింగ్ జరగనుంది. మొత్తం 243 నియోజకవర్గాలు ఉండగా.. మొదటి విడతగా 121 నియోజకవర్గాల్లో గురువారం పోలింగ్ జరుగుతోంది. మొత్తం 3.75 కోట్ల మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. 1,314 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
బీహార్‌లో తొలి విడత సమరానికి సిద్ధమైంది. గురువారం 18 జిల్లాల్లోని 121 నియోజకవర్గాల్లో మొదటి విడతగా పోలింగ్ జరగనుంది. ఇందుకోసం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఇక ఎన్నికల సిబ్బంది కూడా ఆయా బూత్‌లకు తరలివెళ్తున్నారు.
బీహార్‌లో తొలి విడత పోలింగ్‌కు సమయం దగ్గర పడింది. గురువారమే మొదటి విడత పోలింగ్ జరగనుంది. దీంతో మంగళవారం సాయంత్రంతో ప్రచారానికి తెరపడనుంది. దీంతో ప్రచారానికి సమయం లేకపోవడంతో ప్రధాన పార్టీలన్నీ ప్రచారాన్ని ఉధృతం చేశాయి.
బీహార్ ఎన్నికల సమరం రసవత్తరంగా సాగుతోంది. అధికార-ప్రతిపక్ష కూటమిలు నువ్వానేనా? అన్నట్టుగా ఫైటింగ్ చేస్తు్న్నాయి. విమర్శలు-ప్రతి విమర్శలతో వేడి పెంచుతున్నారు. ప్రధాని మోడీ శుక్రవారం.. విపక్ష కూటమి లక్ష్యంగా విమర్శలు గుప్పించగా... తాజాగా ప్రధాని మోడీని టార్గెట్‌గా లాలూ ప్రసాద్ యాదవ్ ప్రతి దాడికి దిగారు.
ప్రధాని మోడీ బీహార్‌లో ఎన్నికల శంఖారావం పూరించారు. శుక్రవారం ఉదయం భారతరత్న కర్పూరి ఠాకూర్ స్వగ్రామం సమస్తిపూర్‌కు చేరుకున్నారు. ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పలకరించారు. అటు తర్వాత సమస్తిపూర్ నుంచి ఎన్నికల ర్యాలీని మోడీప్రారంభించారు. మోడీ వెంట ముఖ్యమంత్రి నితీష్ కుమార్, బీజేపీ నేతలు ఉన్నారు.
బీహార్‌లో ఎన్నికల సమరం నడుస్తోంది. రెండు విడతల్లో జరుగుతున్న పోలింగ్‌కి తొలి విడత నామినేషన్ల ప్రక్రియ ముగిసింది. రెండో దశ ఎన్నికల ప్రక్రియకు నామినేషన్లు నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో 143 మందితో కూడిన అభ్యర్థులను జాబితాను ఆర్జేడీ విడుదల చేసింది.
బీహార్‌లో ఎన్నికల సమరం కొనసాగుతోంది. అన్ని పార్టీలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక ఎన్డీఏ కూటమి కలిసి పోటీ చేస్తుండగా.. విపక్ష కూటమి మాత్రం ఎవరికి వారే విడివిడిగా పోటీ చేస్తున్నారు. తొలి విడత పోలింగ్‌కు నామినేషన్ల ప్రక్రియ ముగియగా.. రెండో విడత పోలింగ్ కోసం నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతోంది.
బీహార్ ఎన్నికలకు సమయం చాలా తక్కువగా ఉంది. ఇంకోవైపు అధికార ఎన్డీఏ కూటమి దూసుకుపోతోంది. కానీ ప్రతిపక్ష ఇండియా కూటమి మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా వ్యవహారం కనిపిస్తోంది.