DGCA Emergency Advisory: దేశ పౌర విమానయాన నియంత్రణ సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (DGCA) విమానయాన సంస్థలు, విమానాశ్రయ నిర్వాహకులకు అత్యవసర కార్యాచరణ సలహాను జారీ చేసింది. మస్కట్ ఫ్లైట్ ఇన్ఫర్మేషన్ రీజియన్ (FIR), పరిసర ప్రాంతాలలో అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు గుర్తించిన తర్వాత DGCA ఈ అత్యవసర సలహాను జారీ చేసింది. అగ్నిపర్వత బూడిద కార్యకలాపాలు అనేవి ఈ ప్రాంతంలో నడుస్తున్న విమానాలకు భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుందని హెచ్చరించింది. READ ALSO:…
అహ్మదాబాద్‌లోని సర్దార్ వల్లభ్ భాయ్ విమానాశ్రయం సమీపంలో జరిగిన విమాన ప్రమాదంపై కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ఉన్నతాధికారులు సమీక్ష నిర్వహించారు. అనంతరం ఢిల్లీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఘోర విమాన దుర్ఘటనను పౌర విమానయాన శాఖ అత్యంత తీవ్రంగా పరిగణిస్తోందని రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనాస్థలిలో సహాయచర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గుజరాత్ ప్రభుత్వం, పౌరవిమానయాన శాఖ సంయుక్తంగా స్పందించినట్లు స్పష్టం చేశారు.