31 ప్రిడేటర్ డ్రోన్‌లను కొనుగోలు చేసేందుకు అమెరికాతో భారత్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇరు దేశాల మధ్య ఈ ఒప్పందంపై ఇరు పక్షాలు సంతకాలు చేశాయి. ఈ ఒప్పందానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చాలా కాలంగా చర్చలు జరుగుతున్నాయి. ఈ డీల్ విలువ రూ.32 వేల కోట్లు.
భారత్ లో సార్వత్రికి ఎన్నికలపై అమెరికా గతంలో ప్రశంసలు కురిపించింది. ప్రపంచంలో భారత్ కంటే శక్తివంతమైన ప్రజాస్వామ్య దేశం మరొకటి లేదని కొనియాడింది. ఆ దేశ వైట్ హౌస్ జాతీయ భద్రతా సమాచార సలహాదారు జాన్ కిర్బీ ఓ ప్రశ్నకు సమాధానమిస్తూ భారత్‌ను ప్రశంసించారు.