ఏసీసీ పురుషుల టీ20 ఎమర్జింగ్ టీమ్స్ ఆసియా కప్ 2024లో భారత్-ఏ జట్టు గ్రూప్ దశను అజేయంగా ముగించింది. తెలుగు ఆటగాడు తిలక్ వర్మ నేతృత్వంలోని భారత్-ఏ టీమ్ సెమీఫైనల్లో అడుగుపెట్టింది. గ్రూప్-బీలో భాగంగా బుధవారం అల్ అమెరత్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఒమన్‌పై ఘన విజయం సాధించింది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ గెలిచిన భారత్.. గ్రూప్-బీలో అగ్రస్థానంలో నిలిచింది. శుక్రవారం జరిగే సెమీఫైనల్లో అఫ్గానిస్థాన్-ఏ జట్టును భారత్ ఢీకొంటుంది.…