దక్షిణాఫ్రికాతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లోని రెండో మ్యాచ్‌లో భారత్ 51 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. 214 పరుగుల లక్ష్య ఛేదనలో టీమిండియా 162 పరుగులకే ఆలౌట్ అయింది. గురువారం చండీగఢ్‌లోని మహారాజా యాదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 213 పరుగులు చేసింది. భారీ ఛేదనలో టీమిండియా కేవలం 162 పరుగులకే కుప్పకూలింది. మంచి పిచ్‌పై బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన భారత్…