President Murmu speech: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం దేశ ప్రజలను ఉద్దేశించి ముర్ము మాట్లాడుతూ.. ఆగస్టు 15 కేవలం స్వేచ్ఛా పండుగ మాత్రమే కాదని, ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. మన రాజ్యాంగం, ప్రజాస్వామ్యం కంటే గొప్పది ఏదీ లేదని అన్నారు. ప్రజాస్వామ్య మార్గంలో సవాళ్లు ఎదురైనప్పటికీ భారతదేశం విజయం సాధించిందన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల వల్లే 78 సంవత్సరాల క్రితం దేశానికి స్వేచ్ఛ వచ్చిందని…