టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా.. ఈరోజు భారత్-అమెరికా మధ్య మ్యా్చ్ జరుగుతుంది. న్యూయార్క్లోని నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో అమెరికా తక్కువ స్కోరు చేసింది. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 110 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు పరుగులు చేయనీయకుండా కట్టడి చేశారు. భారత్ ముందు 111 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది అమెరికా. ఈ మ్యాచ్లో టీమిండియా విజయం సాధిస్తే.. సూపర్-8లోకి ఎంట్రీ ఇస్తుంది.
టీ20 వరల్డ్ కప్లో భాగంగా ఈరోజు ఇండియా-అమెరికా జట్ల మధ్య మ్యా్చ్ జరుగనుంది. ఈ క్రమంలో భారత్ టాస్ గెలిచింది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు. న్యూయార్క్ వేదికగా రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా.. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే.. టీమిండియా సూపర్-8లోకి ఎంటర్ కానుంది.
నసావు అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారత్-అమెరికా మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మైదానం పిచ్‌పై మొదటి నుంచి చర్చ జరుగుతోంది. డ్రాప్ ఇన్ పిచ్ ఇక్కడ ఉపయోగించబడింది. ప్రారంభంలో మ్యాచ్‌లు ఆడినప్పుడు.. అపరిమిత బౌన్స్ కారణంగా ఈ పిచ్‌పై బ్యాట్స్‌మెన్ సమస్యలను ఎదుర్కొన్నారు. అయితే కాలక్రమేణా పిచ్ మెరుగుపడింది. అయితే ఈ పిచ్ ఇప్పటికీ బౌలర్లకు సహాయకరంగా ఉంది. ఇక్కడ బ్యాటింగ్ చేయడం అంత సులభం కాదు. బౌలర్లకు ఇక్కడ చక్కటి సహకారం లభిస్తున్నందున భారత్-అమెరికా మ్యాచ్‌లోనూ…
Paras Mhambrey on Hardik Pandya: హార్దిక్ పాండ్యా బౌలింగ్ సత్తాపై తమకు ఎలాంటి అనుమానాలు లేవని, ఎప్పుడూ నమ్మకంగానే ఉన్నామని టీమిండియా బౌలింగ్ కోచ్ పరాస్ మాంబ్రే తెలిపారు. ఏ ప్లేయర్ అయినా కొన్నిసార్లు లయను అందుకోవడానికి కాస్త సమయం పడుతుందన్నాడు. బౌలింగ్‌లో సత్తా చాటుతున్న హార్దిక్.. తప్పకుండా బ్యాటింగ్‌లో రాణిస్తాడని ధీమా వ్యక్తం చేశాడు. హార్దిక్ బౌలింగ్‌లో మంచి ప్రదర్శన చేయకపోతే.. జట్టు కూర్పుపై చాలా ప్రభావం పడేదని మాంబ్రే పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్…
USA Player Aaron Jones Says Fear is not in our Blood: భారత్‌పై ఎలాంటి భయం లేకుండా ఆడేస్తామని, ప్రతి మ్యాచ్‌లోనూ ఇలాగే ఆడేందుకు తాము ప్రయత్నిస్తున్నామని అమెరికా ప్లేయర్ ఆరోన్ జోన్స్ అన్నాడు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రాను ఎదుర్కోవడం కఠినమే అని పేర్కొన్నాడు. పిచ్ ఎలా స్పందిస్తుందో ఇప్పుడే చెప్పలేమని జోన్స్ తెలిపాడు. టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా నేడు అమెరికాతో భారత్ తలపడనుంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ స్టేడియంలో రాత్రి 8…
Rohit Sharma, Virat Kohli Misses Team India Practice Session: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా బుధవారం న్యూయార్క్లోని నసావు కౌంటీ స్టేడియంలో అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. ఐర్లాండ్, పాకిస్థాన్‌పై విజయం సాధించిన రోహిత్ సేన రెట్టించిన ఉత్సాహంతో ఉంది. పసికూన అమెరికాను ఓడించాలని భారత్ బరిలోకి దిగుతోంది. మరోవైపు పాకిస్థాన్, కెనడాను ఓడించిన జోష్‌లో ఉన్న అమెరికా కూడా.. టీమిండియాపై విజయం సాధించాలని చూస్తోంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు గ్రూప్-ఏ…
8 Indian Players in United States Team: టీ20 ప్రపంచకప్ 2024 గ్రూప్-ఏలో భాగంగా నేడు అమెరికా, భారత్ జట్లు తలపడనున్నాయి. న్యూయార్క్లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో రాత్రి 8 గంటలకు మ్యాచ్ ఆరంభం కానుంది. గ్రూప్-ఏలో ఇరు జట్లు ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ గెలిచి.. మంచి జోష్‌లో ఉన్నాయి. ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలిచినా.. హ్యాట్రిక్ విజయంతో పాటు సూపర్-8 బెర్త్ కూడా దక్కుతుంది. దాంతో విజయం కోసమే అమెరికా,…