భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య ఈరోజు నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా మరికొద్దిసేపట్లో రాంచిలోని జేఎస్సీఏ ఇంటర్నేషనల్ స్టేడియం కాంప్లెక్స్‌లో తొలి వన్డే ప్రారంభం కానుంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా కెప్టెన్ ఏడెన్ మార్‌క్రమ్ బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో భారత్ ముందుగా బ్యాటింగ్ చేయనుంది. తెంబా బావుమా, కేశవ్ మహారాజ్‌లకు విశ్రాంతి ఇచ్చామని చెప్పాడు. ఈరోజు నలుగురు సీమర్లతో బరిలోకి దిగుతున్నట్లు మార్‌క్రమ్ తెలిపాడు. బావుమాకు రెస్ట్…
భారత్, దక్షిణాఫ్రికా జట్ల మధ్య నేటి నుంచి వన్డే సిరీస్ ఆరంభం కానుంది. ఆదివారం రాంచిలో తొలి వన్డే మధ్యాహ్నం 1.30 నుంచి ఆరంభం కానుంది. సొంత గడ్డపై టెస్టు సిరీస్‌లో వైట్‌వాష్‌కు గురై తీవ్ర విమర్శలు ఎదురుకొంటున్న టీమిండియా.. వన్డే సిరీస్ అయినా గెలవాలని చూస్తోంది. ఏడాదికి పైగా విరామం తర్వాత సీనియర్ ప్లేయర్స్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలు స్వదేశంలో అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. దాంతో అందరి దృష్టీ రో-కోల పైనే ఉంది. ఈ…